'జయ జానకి నాయక' ఇంకా సేఫ్ జోన్ లోకి వెళ్లలేదట!
విడుదలైన వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 14 కోట్లకి పైగా షేర్ ను వసూలు చేసింది. మరో పది రోజుల పాటు ఈ సినిమా థియేటర్లలో నిలబడితేనే గాని బయ్యర్లు సేఫ్ జోన్ లోకి వెళ్లడం జరగదని అంటున్నారు. లేదంటే నష్టాలు తప్పవని చెబుతున్నారు. ప్రస్తుతానికి దగ్గరలో పెద్ద సినిమాలేవీ లేవు కనుక, వసూళ్ల పరంగా ఈ సినిమా తన జోరు చూపించే అవకాశం ఉందని అంటున్నారు. ఎటొచ్చి ఓవర్సీస్ లో ఈ సినిమాకి ఆదరణ లేకపోవడమే పెద్ద మైనస్ గా మారింది.