: ఇండియాలో అత్యధిక ఉద్యోగాలు ఇచ్చింది కాగ్నిజెంట్... ఆపై ఐసీఐసీఐ, డెల్లాయిట్!


ఇండియాలోని 26 టాప్ బిజినెస్ స్కూళ్లలో, ఈ సంవత్సరం అత్యధికంగా ఉద్యోగాలను ఇచ్చిన సంస్థగా కాగ్నిజెంట్ నిలిచింది. ఆపై స్థానాల్లో ఐసీఐసీఐ, డెల్లాయిట్ లు నిలిచాయి. ఎకనామిక్ టైమ్స్ ఓ సర్వేను నిర్వహిస్తూ, ఇండియాలో టాప్ రిక్రూటర్స్ సర్వేను నిర్వహించింది. ఇక టాప్ 10లోని కంపెనీలు ఈ సంవత్సరం ఇప్పటివరకూ 1,175 మంది ఎంబీఏ స్టూడెంట్లకు ఆఫర్లు ఇచ్చాయి.

అయితే, గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం ఈ సంఖ్య తగ్గింది. 2016లో మొత్తం 1,543 మంది చదువుకుంటున్న సమయంలోనే టాప్ 10 కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. ఇక ఈ సంవత్సరం టాప్ రిక్రూటర్లుగా ఉన్న కంపెనీల్లో కాగ్నిజెంట్ తొలి స్థానంలో నిలువగా, ఆపై ఐసీఐసీఐ బ్యాంక్, డెల్లాయిట్, క్యాప్ జెమిని, విప్రో, అమెజాన్, ఈవై, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఆక్సెంచర్, కేపీఎంజీలు టాప్ - 10లో ఉన్నాయి.

  • Loading...

More Telugu News