Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కర్ణాటకలో మొదలైన పోలింగ్.. ఓటేసిన వెంకయ్యనాయుడు

కర్ణాటక విధానసభకు ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు బెంగళూరులోని మల్లేశ్వరం బాలికల పాఠశాలలో ఓటు వేశారు. అటు యడ్యూరప్ప కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎండలు అధికంగా ఉండడం వల్ల సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు.

More Telugu News