అమెరికా అధికారిణి 'శారీ సెర్చ్'లో గెలిచిన చీర ఇదే... చీర కట్టుకుని మురిసిపోయిన మేరీ కే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికా అధికారిణి 'శారీ సెర్చ్'లో గెలిచిన చీర ఇదే... చీర కట్టుకుని మురిసిపోయిన మేరీ కే!

న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ వ్యవహారాలు పరిశీలించే అధికారిణి మేరీ కే కార్ల్ సన్, 71వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభవేళ, పట్టుచీర కట్టుకుని మురిసిపోయారు. నేడు జరిగే వేడుకలకు ఎటువంటి చీర కట్టుకోవాలో తనకు సలహా ఇవ్వాలని ఆమె 'శారీ సెర్చ్' పేరిట ట్విట్టర్ లో సలహా కోరగా, వేలాది మంది తమ అభిప్రాయాలను వెల్లడించగా, అత్యధికులు సూచించినట్టుగా కంచి పట్టు చీరను కట్టుకున్న ఆమె, ఆ చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు.

జామ్ దానీ, తుస్సార్, డుపియన్ తదితర వెరైటీ చీరలకు కూడా మంచి ఓట్లు వచ్చినప్పటికీ, 'కంజీవరం'కే అత్యధికులు ఓకే చెప్పారని, తనకూ ఈ చీర చాలా నచ్చిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. మెరూన్ రంగులో ఉన్న చీరకు, గోల్డ్ కలర్ బార్డర్, ఆకుపచ్చ లైన్లతో పైటంచు ఉన్న ఈ చీరలో ఆమె అద్భుతంగా కనిపిస్తున్నారని వేలాది మంది కితాబిచ్చారు. చీరలో మురిసిపోతున్న మేరీ కేను మీరూ చూడవచ్చు.

More Telugu News