కాన్సెప్ట్ కొత్తగా ఉంటేనే ఓకే చెబుతా : తాప్సీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాన్సెప్ట్ కొత్తగా ఉంటేనే ఓకే చెబుతా : తాప్సీ

తెలుగులో అందాల కథానాయికగా వరుస సినిమాలు చేసుకుంటూ వచ్చిన తాప్సీ, అదే స్థాయిలో ఇక్కడ సక్సెస్ లు అందుకోలేకపోయింది. దాంతో తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నించింది. అయితే హిందీలో సక్సెస్ లు అందుకున్న తరువాతనే ఆమెకి అర్థమైంది .. వైవిధ్యభరితమైన సినిమాలు చేసినప్పుడే సరైన గుర్తింపు వస్తుందని. అంతే, అప్పటి నుంచి విజయాలు పలకరించడం మొదలైందని తాప్సీ చెప్పింది.

 గ్లామర్ తో ఎక్కువ కాలం కెరియర్ ను నెట్టుకు రావడం కష్టమని గ్రహించిన తాను, విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ తనని తాను మార్చుకున్నానని అంది. ఈ క్రమంలో రొటీన్ పాత్రలు వస్తున్న కారణంగా తెలుగులో చేయకూడదనుకున్నాననీ, కానీ 'ఆనందో బ్రహ్మ' కొత్త కంటెంట్ తో వచ్చిందని చెప్పింది. తాను ఎందుకు ఈ సినిమాను అంగీకరించాననేది ఈ సినిమా చూసిన తరువాత తెలుస్తుందని అంది. ఈ నెల 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
tapsee

More Telugu News