మరో పాట పాడిన అందాల'రాశి'!

శ్రుతి హాసన్ లా రాశిఖన్నా కూడా మంచి నటే కాకుండా మంచి గాయని కూడా. చిన్నప్పటి నుంచీ కూని రాగాలు తీస్తూ వుండేది. అందుకే, పెద్దయ్యాక సింగర్ కావాలనుకుంది. అయితే, విచిత్రంగా హీరోయిన్ అయింది. అయినప్పటికీ తనలోని గాయనిని అప్పుడప్పుడు మనకు వినిపిస్తూనే వుంది. గతంలో 'జోరు' సినిమాలో ఓ పాట పాడిన రాశి, ఆ తర్వాత మలయాళ చిత్రం 'విలన్'లో కూడా ఓ పాట పాడింది. తాజాగా తనలోని గాయనికి మళ్లీ పనిచెప్పింది. నారా రోహిత్ హీరోగా రూపొందుతున్న 'బాలకృష్ణుడు' చిత్రం కోసం ఓ పాట పాడింది. ఇందులో రోహిత్ సరసన తను కథానాయికగా నటిస్తోంది. ఈ పాట గురించి ఈ చిన్నది చెబుతూ, ఈ పాటను అభిమానులకు వినిపించాలని చాలా ఎగ్జయిటింగ్ గా వున్నానని, త్వరలోనే వినిపిస్తానని చెప్పింది. 
Go Back to Shorts
Rashikhanna
shruti

More Telugu News