'యంగ్ అండ్ ఫ్రీ' సాంగ్ తో అభిమానుల ముందుకు ప్రియాంక!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'యంగ్ అండ్ ఫ్రీ' సాంగ్ తో అభిమానుల ముందుకు ప్రియాంక!

ప్రియాంక చోప్రా ఒక వైపున బాలీవుడ్ సినిమాలు చేస్తూనే మరో వైపున హాలీవుడ్ లోను రాణిస్తోంది. కథానాయికగా కెరియర్ స్పీడు పెంచుతూనే, నిర్మాతగాను తన ప్రత్యేకతను చాటుకుంటోంది. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ఇటీవల ఆమె నిర్మించిన 'వెంటిలేటర్' సినిమాకి అనూహ్యమైన స్పందన వస్తోంది.

మరో వైపున ఆమె వరుస బెట్టి పాటలు కూడా పాడేస్తోంది. ఇప్పటికే కొన్ని పాటలు మార్కెట్లోకి రాగా, తాజాగా 'యంగ్ అండ్ ఫ్రీ' అనే మరో సాంగ్ ను ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ సాంగ్ మ్యూజిక్ యాప్ సావన్ లో అందుబాటులో వుంది. ఒక ప్రయోగం రియాల్టీగా మారిందంటూ .. ఈ పాట రూపొందిన తీరును ఆమె అభిమానులతో చెప్పుకొచ్చింది.   
priyanka

More Telugu News