తెలుగు రాష్ట్రాల్లో 'నేనే రాజు నేనే మంత్రి' తొలిరోజు వసూళ్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు రాష్ట్రాల్లో 'నేనే రాజు నేనే మంత్రి' తొలిరోజు వసూళ్లు!

నిన్న ఒక్క రోజునే మూడు సినిమాలు రిలీజ్ కావడంతో, తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లన్నీ సందడి సందడిగా కనిపిస్తున్నాయి. మూడు సినిమాలు కంటెంట్ పరంగా వైవిధ్యభరితమైనవి కావడంతో, మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మూడు సినిమాల్లో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా విషయానికి వస్తే, తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల పరంగా దూసుకుపోతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలిరోజున 3.75 కోట్ల షేర్ ను రాబట్టినట్టు సమాచారం. ఓవర్సీస్ లోను వసూళ్లు భారీగానే ఉన్నాయని చెబుతున్నారు. ఇక వరుసగా సెలవులు ఉన్నందున ఈ సినిమా వసూళ్లు భారీ స్థాయిలో పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. జోగేంద్రగా రానా పాత్రను తీర్చిదిద్దిన తీరు ..  ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు .. డైలాగ్స్ ..కాజల్ గ్లామర్ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయని చెప్పుకుంటున్నారు.      
rana
kajal

More Telugu News