ఉగ్రవాది జకీర్ మూసాను చుట్టుముట్టిన సైన్యం.. రాళ్ల మూక సాయంతో తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉగ్రవాది జకీర్ మూసాను చుట్టుముట్టిన సైన్యం.. రాళ్ల మూక సాయంతో తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్!

భద్రతా దళాలకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జకీర్ మూసాకు కశ్మీర్‌లోని రాళ్లు విసిరే మూక (స్టోన్ పెల్టర్స్) మరోమారు అండగా నిలిచారు. వారి సాయంతో జకీర్ సునాయాసంగా తప్పించుకున్నాడు. శుక్రవారం ట్రాల్‌లోని నూర్పోరా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అల్ ఖాయిదా సాయంతో సహచరుడితో కలిసి సొంత ఉగ్రవాద సంస్థను స్థాపించిన జకీర్, మరో వ్యక్తితో కలిసి నూర్పొరాలోని తన ఇంట్లో ఉన్నాడన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆ ఊరిని చుట్టుముట్టాయి.

దీంతో రంగంలోకి దిగిన స్టోన్ పెల్టర్లు భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే విచిత్రంగా కాసేపటి  తర్వాత  రాళ్ల దాడి ఆగిపోయింది. అక్కడి నుంచి అందరూ వెళ్లిపోయారు. ఆ తర్వాత జకీర్ మూసా, అతడి సహచరుడు కనిపించకుండా పోయారు. అతడిని తప్పించేందుకే స్టోన్ పెల్టర్లు వచ్చారని, వారు తప్పించుకున్నాక అక్కడి నుంచి వారు వెళ్లిపోయారని భద్రతా దళాలు గుర్తించాయి. అయితే అప్పటికే చీకటి కావడంతో ఆపరేషన్ ఆపేసిన అధికారులు నేడు తిరిగి మూసా కోసం వేట ప్రారంభించనున్నారు.

More Telugu News