ఆరు బంతుల్లో ఆరు వికెట్లు... క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆరు బంతుల్లో ఆరు వికెట్లు... క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డు!

క్రికెట్ చరిత్రలో మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ కొట్టడం తరచూ చూస్తూనే ఉంటాం. ఇక ఒకే ఓవర్ లో నాలుగు లేదా ఐదు వికెట్లు తీసిన సందర్భాలు చాలా అరుదు. ఇక ఓవర్ లో ఆరు వికెట్లు తీస్తే... అది కూడా అన్నీ క్లీన్ బౌల్డ్ అయితే... గ్రేటెస్ట్ అనాల్సిందే. ఆ ఫీట్ నే చేసి చూపించాడు ఫిలడెల్ఫియా యువ క్రికెటర్, అండర్ - 13 క్రికెట్ టోర్నీలో బౌలింగ్ చేసిన రాబిన్ సన్ అనే కుర్రాడు డబుల్ హ్యాట్రిక్ సాధించి ఔరా అనిపించాడు. అతను సాధించిన ఘనతపై బ్రిటన్ పత్రికలు ప్రముఖంగా కథనాలు ఇచ్చాయి. కాగా, ఈ ఫీట్ సాధిస్తున్న వేళ, రాబిన్ సన్ తల్లి హెలెన్ స్కోరర్ గా వెల్లడిస్తుండగా, తండ్రి స్టీఫెన్ అంపైరింగ్ చేస్తుండటం గమనార్హం. ఇక అతని తాత గ్లెన్ మ్యాచ్ ని స్వయంగా వీక్షించి మనవడి అద్భుత రికార్డును ఆస్వాదించాడట.

More Telugu News