‘అల్ ఖైదా’ భారత్ వ్యవహారాల చీఫ్ ను చుట్టుముట్టిన భద్రతా బలగాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘అల్ ఖైదా’ భారత్ వ్యవహారాల చీఫ్ ను చుట్టుముట్టిన భద్రతా బలగాలు

ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా భారత వ్యవహారాల చీఫ్ జకీర్ మూసాన్ ను భారత భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. జమ్మూకశ్మీర్ లోని నోర్ పూర్ ప్రాంతంలోని ట్రాల్ లో ఓ ఇంట్లో  మూసా తలదాచుకున్నట్టు సమాచారం అందడంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఇదిలా ఉండగా, మూసా స్వగ్రామం నోర్ పుర. ఈ గ్రామంలోని అల్లరిమూకలు రోడ్లపైకి వచ్చి అల్లర్లు సృష్టించడం, నిరసనలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సెక్యూరిటీ అధికారులను అల్లరిమూకలు అడ్డుకున్నట్టు సమాచారం.

More Telugu News