: డ్యాన్స్ చేస్తూ ‘మ్యాజిక్ సెల్ఫీ వీడియో’ పోస్ట్ చేసి అలరిస్తోన్న హీరోయిన్ కాజల్.. మీరూ చూడండి!
'లైక్ యాప్' ద్వారా తీసిన సెల్ఫీ మ్యాజిక్ వీడియోను పోస్టు చేసి హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన అభిమానులను అలరిస్తోంది. ఈ వీడియోలో డ్యాన్స్ చేస్తూ శరీరం నుంచి కాంతులు వెదజల్లుతూ కాజల్ కనపడుతోంది. తాను ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నానని, మ్యాజిక్ సెల్ఫీ వీడియోలు చిత్రీకరించుకుంటున్నానని ఆమె ఆ యాప్‌కి పబ్లిసిటీ ఇస్తోంది. తనతో పాటు సెల్పీ దిగాలనుకుంటే ఈ ట్వీట్ ను షేర్ చేసి #likekajalaggarwal ను ట్యాగ్ చేయమని ఈ అమ్మడు కోరుతోంది. ఆమె ట్వీట్ కి విశేషంగా స్పందన వస్తోంది. కాజల్ చేస్తోన్న ఈ మ్యాజిక్ డ్యాన్స్ పట్ల ఎంతో ఆసక్తికనబరుస్తున్నారు.