కొన్నిసార్లు రెమ్యునరేషన్ తీసుకోనే లేదు : తేజ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొన్నిసార్లు రెమ్యునరేషన్ తీసుకోనే లేదు : తేజ

వరుస ప్రేమకథా చిత్రాలతో యూత్ ను ఒక ఊపు ఊపేసిన దర్శకులలో తేజ ఒకరు. ప్రేమకథల్లోనే ఒక్కోసారి ఒక్కో కోణాన్ని ఆయన కొత్తగా ఆవిష్కరించడం వలన, ఆయన ఖాతాలో వరుస విజయాలు చేరాయి. అయితే ఆ తరువాత సక్సెస్ అనేది దూరమైపోయింది. ఈ సమయంలోనే తనతో సినిమాలు చేయడానికి కొంతమంది నిర్మాతలు ఆలోచించారని తేజ అన్నారు.

 సక్సెస్ లో లేవు కనుక వెంటనే రెమ్యునరేషన్ ఇవ్వలేమనీ .. సినిమా హిట్ అయితే అప్పుడు ఆలోచిస్తామని మరికొందరు అనేవారట. అయినా తన ప్రయత్నం తాను చేయాలి కనుక, సినిమాలు చేస్తూ వచ్చానని చెప్పారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలకి పారితోషికమే తీసుకోలేదని అన్నారు. సక్సెస్ ఎప్పుడూ సంతోషాన్ని మాత్రమే ఇస్తుంది .. ఫెయిల్యూర్ ఎన్నో విషయాలను అనుభవంలోకి తెస్తుంది. ఈ పాఠం నేర్చుకుంటూనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నానని తేజ స్పష్టం చేశారు.   
rana
kajal

More Telugu News