: సంజయ్‌దత్ `భూమి` చిత్రం ట్రైలర్ విడుదల
చాలా కాలం తర్వాత బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ `భూమి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే విడుదలైన సంజయ్‌దత్ ఫస్ట్‌లుక్ పోస్టర్లు అభిమానుల్లో అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ కూడా ఇవాళ విడుదలైంది. ఇందులో సంజయ్‌దత్ తన కూతురికి జరిగిన అన్యాయాన్ని ఎదుర్కునే తండ్రిగా కనిపించారు. ఆయన కూతురిగా అదితీ రావ్ హైదరీ నటించారు.
దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ సినిమా కథ మీద ఒక అభిప్రాయాన్ని కలిగించేలా ఉంది. సంజయ్‌దత్ నట విశ్వరూపం మరోసారి ప్రేక్షకులకు కనువిందు కలిగించనుంది. యాక్షన్ సన్నివేశాలు, తండ్రికూతుళ్ల మధ్య ఉన్న ఉద్వేగ సన్నివేశాలతో ఉన్న ఈ ట్రైలర్ సినిమా మీద మరిన్ని అంచనాలను పెంచింది. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 22న విడుదలకానుంది.