నాని కెరియర్లో ప్రత్యేక స్థానంలో నిలిచిన 'నిన్నుకోరి'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాని కెరియర్లో ప్రత్యేక స్థానంలో నిలిచిన 'నిన్నుకోరి'

కథలో కొత్తదనం ఉంటేనే తప్ప ప్రేక్షకులు ఆదరించని ఈ రోజుల్లో ఎవరైనా ఒక హ్యాట్రిక్ హిట్ కొట్టడమే కష్టం. అలాంటిది నాని నాన్ స్టాప్ గా డబుల్ హ్యాట్రిక్ కొట్టేశాడు. కథా కథనాలకు .. మారుతోన్న ప్రేక్షకుల అభిరుచికి నాని ఇచ్చే ప్రాధాన్యత ఇందుకు నిదర్శనమని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలలో వసూళ్ల పరంగా మూడు సినిమాలు ఆయన కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచాయి.

 మొదటి స్థానంలో 'ఈగ' ఉండగా .. రెండవ స్థానంలో 'నేను లోకల్' .. మూడవ స్థానంలో 'నిన్ను కోరి' నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో .. ముఖ్యంగా బీసీ సెంటర్లలో 'నిన్ను కోరి' భారీ వసూళ్లను సాధించి ఆశ్చర్యపరిచింది. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా 28.86 కోట్ల డిస్ట్రిబ్యూటర్ల షేర్ ను రాబట్టడం విశేషం. ఇలా ఈ సినిమా నాని కెరియర్లో మూడో బెస్ట్ గా నిలిచింది.         
nani
niveda

More Telugu News