హిట్ ఖాయమనే నమ్మకం అప్పుడే కుదిరింది : హను రాఘవపూడి

నితిన్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి 'లై' సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హను రాఘవపూడి మాట్లాడుతూ, ప్రేమ ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు చెప్పాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉందనీ .. అది యాక్షన్ కింగ్ అర్జున్ చేస్తే బాగుంటుందని భావించానని అన్నాడు.

 తాను చిన్నప్పటి నుంచి అర్జున్ కి అభిమానిననీ .. ఆయన సినిమాలు తప్పకుండా చూసేవాడినని చెప్పాడు. నటుడిగానే కాదు .. దర్శకుడిగా కూడా అర్జున్ కి ఎంతో అనుభవం వుందని, అలాంటి అర్జున్ ను కలిసి కథ చెప్పాలంటే కాస్త భయంగానే అనిపించిందనీ, అంతా విన్న తరువాత ఆయన ఓకే చెప్పేశారని అన్నాడు. ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడే ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయమనిపించిందనీ .. ఇప్పటికీ ఆ నమ్మకం అలాగే ఉందని చెప్పుకొచ్చాడు.  
Go Back to Shorts
nithin
megha akash

More Telugu News