పాపం .. రెజీనాకి మళ్లీ నిరాశే మిగిలింది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాపం .. రెజీనాకి మళ్లీ నిరాశే మిగిలింది!

తెలుగు తెరకి పరిచయమవుతోన్న కథానాయికల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ పోతోంది. దాంతో ఆల్రెడీ గుర్తింపు తెచ్చుకున్న కథానాయికలు తమ స్థానాన్ని కాపాడుకోవడానికి, తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి కథానాయికల జాబితాలో రెజీనా కూడా వుంది. ఇటీవల కాలంలో తెలుగులో రెజీనాకి అవకాశాలు బాగా తగ్గాయి. తెలుగులో ఆమె చేసిన 'నక్షత్రం' కూడా ఆలస్యంగానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 ఈ సినిమా హిట్ కొడితే .. తెలుగులో మళ్లీ బిజీ అవుతానని రెజీనా భావించింది. కానీ ఈ సినిమా ఫలితం కూడా ఆమెకి నిరాశనే మిగిల్చింది. ఇప్పుడామె చేతిలో కొత్తగా ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. తమిళ సినిమాలు మాత్రం మూడు వున్నాయి. దాంతో అక్కడైనా నిలదొక్కుకోవాలనే గట్టి పట్టుదలతో ఆమె ఉన్నట్టు సమాచారం.  
regina

More Telugu News