తండ్రితనం అంటే ఏమిటో తెలిసొచ్చింది: 'ఫిదా' ఫాదర్!
నిజ జీవితంలో తాను పెళ్లి చేసుకోలేదనీ .. తండ్రిని కాలేదని ఆయన అన్నారు. అయితే 'ఫిదా' సినిమాలో సాయిపల్లవి తండ్రిగా తాను నటిస్తున్నప్పుడు తండ్రి తనంలోని గొప్పతనం తనకి అర్థమైందని చెప్పారు. అప్పుడు తనకి తెలియకుండానే కళ్ల వెంట నీళ్లొచ్చేవని అన్నారు. సాయిపల్లవిని తాను నిజంగానే కూతురుగా భావిస్తున్నాననీ .. షూటింగ్ పూర్తయిన తరువాత కూడా ఆమె అదే ఆత్మీయత చూపుతుండటం ఎంతో సంతృప్తిని ఇస్తోందని చెప్పుకొచ్చారు.