తండ్రితనం అంటే ఏమిటో తెలిసొచ్చింది: 'ఫిదా' ఫాదర్!

సాయిచంద్ .. నటుడిగా నిన్నటితరం ప్రేక్షకులకు ఆయన బాగా తెలుసు. సామాజిక సందేశంతో కూడిన సినిమాల్లో .. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే .. ఉద్యమ స్ఫూర్తిని రగిల్చే పాత్రల్లో సాయిచంద్ నటించారు. ఆ తరువాత సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చిన ఆయన, మళ్లీ ఇన్నాళ్లకు 'ఫిదా' సినిమాలో తెరపై కనిపించారు. సాయి పల్లవి తండ్రిగా అద్భుతమైన నటనను కనబరిచారు.

నిజ జీవితంలో తాను పెళ్లి చేసుకోలేదనీ .. తండ్రిని కాలేదని ఆయన అన్నారు. అయితే 'ఫిదా' సినిమాలో సాయిపల్లవి తండ్రిగా తాను నటిస్తున్నప్పుడు తండ్రి తనంలోని గొప్పతనం తనకి అర్థమైందని చెప్పారు. అప్పుడు తనకి తెలియకుండానే కళ్ల వెంట నీళ్లొచ్చేవని అన్నారు. సాయిపల్లవిని తాను నిజంగానే కూతురుగా భావిస్తున్నాననీ .. షూటింగ్ పూర్తయిన తరువాత కూడా ఆమె అదే ఆత్మీయత చూపుతుండటం ఎంతో సంతృప్తిని ఇస్తోందని చెప్పుకొచ్చారు.  
Go Back to Shorts
saichand
sai pallavi

More Telugu News