: బంగ్లాదేశ్ 'సుల్తాన్ ఆఫ్ సెక్స్' అరెస్ట్... 150 మంది మహిళల వీడియోలు స్వాధీనం
తనను తాను 'సుల్తాన్ ఆఫ్ సెక్స్'గా పేర్కొంటూ, మేల్ ఎస్కార్ట్ గా ఆన్ లైన్లో యువతులను, మహిళలను ఆకర్షించి వారితో తానున్న వీడియోలను చూపి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న ఫౌద్ బిన్ సుల్తాన్ ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢాకాలోని ఆయన ఇంటిపై దాడి చేసిన పోలీసులు, ఓ ల్యాప్ టాప్, మెటాంఫిటమైన్ టాబ్లెట్లు, అశ్లీల వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. ఆన్ లైన్ లో తనను కోరుకునేవారిని తన ఇంటికే పిలిపించుకుని, వారితో సన్నిహితంగా గడిపి డబ్బు తీసుకుని, వారికి తెలియకుండా వీడియోలు తీసి, ఆపై బ్లాక్ మెయిల్ చేసి మరింత డబ్బు గుంజడం ఫౌద్ పని.
పెళ్లయిన మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ దందా సాగిస్తున్న ఫౌద్, వద్ద 150 వరకూ బాధితుల నగ్న వీడియోలు ఉన్నాయని పోలీసు అధికారి ఇస్తీక్ అహ్మద్ వెల్లడించారు. పగటిపూట రియల్ ఎస్టేట్ ఏజంట్ గా పనిచేసే ఫౌద్, సూపర్ హీరో మాస్క్ లు ధరించి, లైవ్ స్ట్రీమింగ్ లో వల్గర్ వీడియోలు చూపుతూ మహిళలను ఆకర్షించే వాడని తెలిపారు. లైంగిక సుఖాన్ని అందించడంలో తనకు మించిన వారు లేరంటూ చెప్పుకునే అతను పోలీసు విచారణలో నేరాలన్నీ అంగీకరించాడని అహ్మద్ పేర్కొన్నారు. మహిళలు స్వీయ అంగీకారంతోనే తన వద్దకు వచ్చేవారని, తన తప్పులేదని అతను వాదిస్తుండటం గమనార్హం. పోర్నోగ్రఫీ చట్ట వ్యతిరేకమైన బంగ్లాదేశ్ లో ఫౌద్ పై నేరం నిరూపితమైతే పదేళ్ల వరకూ శిక్ష పడుతుందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.