పోటీకి తానూ రెడీ అంటోన్న ధనుష్!

'విఐపి' సినిమా తనకి అందించిన సూపర్ హిట్ ను మరిచిపోలేని ధనుష్, ఆ సినిమాకి సీక్వెల్ గా 'విఐపి 2'ను తెరకెక్కించాడు. తెలుగు .. తమిళ భాషలలో ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఆగస్టు 10న తమిళంలో 'వివేగం' రానుంది. దాంతో ధనుష్ రెండు భాషల్లోను తన సినిమా రిలీజ్ ను ఆగస్టు 24కి మార్చుకున్నాడు.

 ఈ నేపథ్యంలో కొన్ని కారణాల వలన 'వివేగం' విడుదల వాయిదా పడింది. దాంతో ముందుగా అనుకున్నట్టుగానే ధనుష్ ఆగస్టు 11కి వచ్చేస్తున్నాడు. అదే రోజున తెలుగులో 'జయ జానకి నాయక' .. 'లై' .. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలు ఉన్నప్పటికీ, పోటీకి తానూ రెడీ అంటూ రంగంలోకి దిగిపోతున్నాడు. ఈ సినిమాలన్నింటిలో అత్యధిక వసూళ్లను సాధించి రికార్డును పట్టుకుపోయేదేమిటో చూడాలి మరి.     
Go Back to Shorts
dhanush
amala paul

More Telugu News