: దర్శకుడు బాబీ పుట్టినరోజు.. విషెస్ తెలిపిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో తెరకెక్కుతున్న చిత్రం జై లవ కుశ. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న బాబీ ఈరోజు బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. ‘జై లవ కుశ’ సెట్స్ లోనే తన పుట్టినరోజును జరుపుకున్న బాబీకి, జూనియర్ ఎన్టీఆర్, సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్, ప్రముఖ నటుడు సాయికుమార్, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు తదితరులు బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పారు.
ఈ సందర్భంగా బాబీ కేక్ కోస్తుండగా చిత్ర యూనిట్ ఉన్న ఫొటోను కల్యాణ్ రామ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కాగా, ‘జైలవకుశ’ టీజర్ జులై 6న విడుదలైంది. ఇప్పటివరకు జై క్యారెక్టర్ కు సంబంధించి టీజర్ ను మాత్రమే విడుదల చేయగా, ఇంకా, లవ, కుశ పాత్రలకు సంబంధించిన టీజర్లు విడుదల కావాల్సి ఉంది. సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.