: చంద్రబాబు మాటలు నమ్మకండి!: పవన్ కల్యాణ్ కు ముద్రగడ లేఖ


జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న అబద్ధాలను నమ్మరాదని లేఖలో ముద్రగడ కోరారు. చంద్రబాబుతో ప్రయాణించి మీ పరపతిని తగ్గించుకోవద్దని సూచించారు. జీవో నెంబర్ 30 కోసం కాపులు ఒత్తిడి చేస్తున్నట్టు చంద్రబాబు ఆవేదన చెందినట్టు తెలిసిందని... అయితే కేవలం ఏడు నెలల్లోనే హామీని నెరవేరుస్తానన్న చంద్రబాబు మాట తప్పారని పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్లపై అబద్ధాల మీద అబద్ధాలను ప్రభుత్వం చెబుతోందని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలుగా మారాయని చెప్పారు. ప్రభుత్వ తీరుతో కాపులు ఎంతో బాధపడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News