అసలు విషయం తెలుసుకోకుండా ట్రంప్ ను విమర్శించినందుకు క్షమాపణలు: ‘హ్యారీ పోటర్’ రచయిత్రి రోలింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అసలు విషయం తెలుసుకోకుండా ట్రంప్ ను విమర్శించినందుకు క్షమాపణలు: ‘హ్యారీ పోటర్’ రచయిత్రి రోలింగ్

వారం రోజుల క్రితం వైట్ హౌస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ తో కరచాలనం చేసేందుకు ఓ దివ్యాంగ బాలుడు ఆసక్తి చూపగా, అతన్ని పట్టించుకోకుండా ట్రంప్ వెళ్లిపోయారనే ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే, ఆ వీడియోను చూసిన హ్యారీ పోటర్ పుస్తక రచయిత్రి జె.కె. రోలింగ్, ట్రంప్ పై విమర్శలు గుప్పించారు. ఆ దివ్యాంగ బాలుడిని పట్టించుకోకుండా ట్రంప్ వెళ్లిపోవడం దారుణమంటూ విమర్శించారు. అయితే, ఆ వీడియో ఫేక్ అని, ఎడిట్ చేశారనే విషయం తెలుసుకున్న రోలింగ్ తన ట్విట్టర్ వేదికగా ట్రంప్ కు క్షమాపణలు చెప్పారు. అసలు, విషయం తెలుసుకోకుండా ట్రంప్ ను విమర్శించడం పొరపాటైందని పేర్కొన్న రోలింగ్, ఎడిట్ అయిన వీడియోను కూడా పోస్ట్ చేశారు.

More Telugu News