ఇలియానా ఖాతాలో ఇంకో హిట్ పడిపోయింది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇలియానా ఖాతాలో ఇంకో హిట్ పడిపోయింది!

తెలుగు .. తమిళ భాషల్లో ఇలియానాకి ఒక్క అవకాశం కూడా దక్కే పరిస్థితి లేదు. దాంతో ఆమె బాలీవుడ్ నే నమ్ముకుని తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకి ఆనందాన్ని కలిగిస్తూ ఒక హిట్ దొరికింది. క్రితం ఏడాది 'రుస్తుం' మూవీతో సక్సెస్ ను అందుకున్న ఇలియానా, అప్పటి నుంచి మరో విజయం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. అలాంటి ఇలియానా తాజా చిత్రంగా 'ముబారకన్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తొలి రోజున ఈ సినిమా వసూళ్లు 5 కోట్లు దాటాయి అంతే. ఆ తరువాత సినిమాపై మంచి టాక్ రావడంతో రెండో రోజు 7.5 కోట్లు .. మూడో రోజు 10 కోట్లు వచ్చాయి. ఇలా ఈ సినిమా వసూళ్లు పెరుగుతూ పోతుండటం విశేషం. అనీష్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో, ఇలియానాకి ఇంకో హిట్ దొరికేసింది. ఈ సక్సెస్ తనకి బాలీవుడ్లో మరిన్ని ఛాన్సులు దక్కడానికి ఉపయోగపడుతుందని ఇలియానా భావిస్తోంది. అనిల్ కపూర్ .. అర్జున్ కపూర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాతో, ఇలియానా నమ్మకం నిజమవుతుందేమో చూడాలి.   
iliana
arjun kapoor

More Telugu News