మెగా మూవీగా చెప్పుకునే 'వివేగం' రిలీజ్ డేట్ మారింది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెగా మూవీగా చెప్పుకునే 'వివేగం' రిలీజ్ డేట్ మారింది!

తమిళంలో భారీ బడ్జెట్ మూవీగా 'వివేగం' రాబోతోంది. ముందుగా ఈ సినిమా విడుదల తేదీని ఆగస్టు 10గా నిర్ణయించారు. అజిత్ సినిమా అంటే అక్కడ ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. అందువలన మిగతా హీరోలంతా తమ సినిమాల విడుదల తేదీలను కాస్త దూరంగా పెట్టుకున్నారు. ఆగస్టు 11న తమిళంలో ప్లాన్ చేసుకున్న 'నేనే రాజు నేనే మంత్రి' విషయంలోను సందిగ్ధత ఏర్పడింది.

 ఈ నేపథ్యంలో 'వివేగం' రిలీజ్ డేట్ 10వ తేదీ నుంచి 24వ తేదీకి వెళ్లింది. దాంతో ఆ రోజున రిలీజ్ పెట్టుకున్న 'విఐపి 2' ఆగస్టు 4న గానీ .. 11న గాని రావడానికి రెడీ అవుతోంది. ఇక 'నేనే రాజు నేనే మంత్రి' ఆగస్టు 11నే రానుంది. మిగతా హీరోలు కూడా తమ సినిమాల విడుదల తేదీల విషయంలో ముందస్తుగా చేసుకున్న ప్లాన్ లో మార్పులు చేసుకుంటున్నారట. 'వివేగం' .. తెలుగులో 'వివేకం'గా రానున్న సంగతి తెలిసిందే.      
ajith
kajal

More Telugu News