Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెంకీ, రానా మల్టీస్టారర్ తమిళ మూవీకి రీమేక్ అట!

వెంకటేశ్, రానా కథానాయకులుగా ఒక భారీ మల్టీ స్టారర్ తెరకెక్కనుందనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. దాంతో అందరి దృష్టి ఈ ప్రాజెక్టుపై పడింది. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా వుండనుందనే విషయం మరింత ఆత్రుతను పెంచుతోంది. ఈ ఇద్దరూ చేసే కథ ఏ తరహాకి చెందినది... దర్శకుడెవరు? అనేది ఆసక్తిగా మారింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా 'విక్రమ్ వేదా' అనే తమిళ మూవీకి రీమేక్ అని తెలుస్తోంది. మాధవన్, విజయ్ సేతుపతి కథానాయకులుగా నటించిన ఈ సినిమా, ఈ మధ్య తమిళంలో ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో మాధవన్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా, విజయ్ సేతుపతి గ్యాంగ్ స్టర్ గా అదరగొట్టేశారు. మాధవన్ పాత్రను వెంకటేశ్, విజయ్ సేతుపతి పాత్రను రానా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇక దర్శకుడెవరన్నది త్వరలో తేలనుంది.       
venkatesh
rana

More Telugu News