అమ్మా... దయచేసి 'అన్నా' అని పిలవద్దు: గాయని కల్పనకు ఎన్టీఆర్ వేడుకోలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమ్మా... దయచేసి 'అన్నా' అని పిలవద్దు: గాయని కల్పనకు ఎన్టీఆర్ వేడుకోలు

హీరో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా సాగుతున్న 'బిగ్ బాస్' కార్యక్రమం విజయవంతంగా సాగుతుండగా, తాజా ఎపిసోడ్ లో కంటెస్టెంట్ గా ఉన్న గాయని కల్పన, పదేపదే ఎన్టీఆర్ ను అన్నా... అన్నా అని పిలుస్తుండటాన్ని ఆయన అడ్డుకున్నాడు. ఆ పిలుపు చికాకును తెప్పించిందో లేక ఆమె తనకన్నా పెద్దదని భావించాడో... ‘అమ్మా.. నన్ను దయచేసి అన్నా అని పిలవకు' అని వేడుకున్నాడు. దీనిపై స్పందించిన కల్పన, ఇకపై 'తారక్ గారు' అని సంబోధిస్తానని చెప్పింది. ఇక తాజా టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్లందరూ తమ దృష్టిలో బిగ్ బాస్ హౌస్ విలన్ ఎవరో చెప్పాలని కోరగా, అత్యధికులు కల్పన పేరు చెప్పడం గమనార్హం.

More Telugu News