డ్రగ్స్ విషయంలో రానా కీలక వ్యాఖ్యలు.. పెద్దలు తీసుకుంటే ఓకే.. కానీ పిల్లలే.. అంటూ ఆవేదన!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డ్రగ్స్ విషయంలో రానా కీలక వ్యాఖ్యలు.. పెద్దలు తీసుకుంటే ఓకే.. కానీ పిల్లలే.. అంటూ ఆవేదన!

టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు విషయంలో నటుడు రానా కీలక వ్యాఖ్యలు చేశాడు. నిజం చెప్పాలంటే నటులు, దర్శకులు డ్రగ్స్ తీసుకుంటున్నందుకు తనకు బాధగా లేదని, ఎందుకంటే వారు పెద్దవారని, అది వారి జీవితమని పేర్కొన్నాడు. వారు ఎలా కావాలంటే అలా నడుచుకోవచ్చని స్పష్టం చేశాడు. అయితే వీటి బారిన చిన్నారులు పడడమే తనను తీవ్రంగా బాధిస్తోందన్నాడు. స్కూలు పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలిసి తాను చాలా కలత చెందానన్నాడు. ఈ విషయమై తీవ్రంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పాడు. అసలు పిల్లలకు డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తున్నారు? డ్రగ్స్ తెస్తున్నవారు విదేశీయులా? వారు దేశంలోకి డ్రగ్స్‌ను ఎలా తీసుకురాగలుగుతున్నారు? అని రానా ప్రశ్నించాడు. కాగా, రానా నటించిన ‘నేనే రాజు-నేనే మంత్రి’ సినిమా విడుదలకు సిద్ధమైంది.

More Telugu News