లుఫ్తాన్సా విమానంలో.. మార్గమధ్యంలో ప్రయాణికురాలికి ప్రసవం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లుఫ్తాన్సా విమానంలో.. మార్గమధ్యంలో ప్రయాణికురాలికి ప్రసవం!

లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ విమానం ఎల్ హెచ్ 543 కొలంబియాలోని బోగోటా నుంచి జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ కు వెళుతుండగా, భూమికి 39,000 అడుగుల ఎత్తున వుండగా... గర్భంతో ఉన్న 38 ఏళ్ల ప్రయాణికురాలికి అకస్మాత్తుగా నొప్పులు మొదలయ్యాయి. దీంతో వెంటనే ఆ విమానాన్ని మాంచెస్టర్ కు దిశ మార్చారు. అదృష్టవశాత్తూ అదే విమానంలో ముగ్గురు డాక్టర్లు ఉండడం ఆ మహిళకు వరంగా మారింది. వైద్యులు, క్యాబిన్ సిబ్బంది సాయంతో మహిళకు సుఖ ప్రసవం చేశారు. మగ శిశువు విమానంలో కళ్లు తెరిచాడు. సదరు మహిళ పేరు దేశిస్ లావా కాగా, పూర్తిగా నెలలు నిండక ముందే ప్రసవం జరిగింది. విమానంలో ప్రయాణికులను ముందుకు పంపి, వెనుక వైపు ప్రసవం కానిచ్చేశారు. వైద్యులు చేసిన సాయాన్ని మరవరాదనుకున్న ఆమె తన శిశువుకు వైద్యుల్లో ఒకరి పేరు నికోలాయ్ ను ఖరారు చేసింది. 

More Telugu News