Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పూరీకి ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తోన్న బాలకృష్ణ ఫ్యాన్స్!

మొదటి నుంచి కూడా పూరీ స్కూల్ వేరు .. బాలకృష్ణ అనుసరిస్తూ వస్తోన్న పంథా వేరు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో మొదటిసారిగా 'పైసా వసూల్' తెరకెక్కుతోంది. దాంతో తమ అభిమాన హీరోను పూరీ ఎలా చూపించనున్నాడోననే ఆసక్తి బాలకృష్ణ అభిమానుల్లో వుంది. తమ అంచనాలను అందుకునేలా ఈ సినిమా వుంటుందా? అనే సందేహం మొదలైంది.

 ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం వచ్చిన 'స్టంపర్' వాళ్ల సందేహాలకు తెరదించేసింది. పూరీ తనదైన స్టైల్లో బాలకృష్ణను చూపించిన తీరుపట్ల వాళ్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూరీ తరహా డైలాగ్స్ కు .. యాక్షన్ సీన్స్ కు .. స్పెషల్ సాంగ్ లో బాలయ్య స్టెప్పులకు వాళ్లు ఫిదా అవుతున్నారు. బాలకృష్ణను కొత్తగా చూపిస్తూ .. ఆయన సందడిని సరికొత్తగా ఆవిష్కరించిన పూరీ జగన్నాథ్ కి వాళ్లు ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తున్నారు.
balakrishna
shriya

More Telugu News