Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీరు మా ప్రధాని అయితే ఎంతో బాగుండేది: సుష్మా స్వరాజ్ కు పాక్ మహిళ నుంచి ఊహించని ప్రశంసలు

మీరు మా దేశ ప్రధాన మంత్రి అయితే ఎంతో బాగుండేదని ఓ పాక్ మహిళ కేంద్ర మంత్రి సుస్మా స్వరాజ్ పై ప్రశంసల జల్లు కురిపించింది. భారత్ లో వైద్యం కోసం దరఖాస్తు పెట్టుకున్న వెంటనే అనుమతినిచ్చిన సుష్మపై ఆమె ఎనలేని ప్రేమను కురిపించింది. ఇంత తొందరగా స్పందిస్తారని తాను కలలో కూడా ఊహించలేదని హిజబ్ ఆసిఫ్ అనే మహిళ కొనియాడింది. ఈ మేరకు ఆమె సుష్మకు ట్వీట్ చేశారు.

'మిమ్మల్ని ఏమని పిలవాలి? దేవత అనా? సూపర్ మహిళ అనా? మీ అత్యున్నత స్వభావం గురించి చెప్పడానికి నాకు మాటలు కూడా రావడం లేదు. మిమ్మల్ని పొగడకుండా ఉండలేకపోతున్నా. ఐ లవ్యూ మేడమ్. నా గుండె మీ కోసమే కొట్టుకుంటోంది. మీరు మా దేశ ప్రధాని అయితే, ఎన్నో మార్పులు తీసుకొచ్చేవారు' అంటూ ట్వీట్ చేసింది.

భారత్ వీసా కోసం హిజబ్ ఆసిఫ్ దరఖాస్తు చేసుకుంటే, ఆమెకు రికమెండేషన్ లెటర్ ఇవ్వడానికి పాక్ విదేశాంగ సలహాదారు సర్తార్ అజీజ్ నిరాకరించారు. దీంతో, ఆమె సుష్మ స్వరాజ్ కు ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన సుష్మ... హిజబ్ కు సహాయం చేయాలంటూ పాక్ లోని భారత హైకమిషన్ ను ఆదేశించారు.

More Telugu News