venkatesh: భారీ బడ్జెట్ తో రానా .. వెంకటేశ్ ల మల్టీస్టారర్!

విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ రానా ముందుకెళ్తున్నాడు. నటనలో రానా మంచి పరిణతిని కనబరుస్తూ వుండటంతో, ఆయనను స్టార్ హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో నిర్మాత సురేశ్ బాబు వున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వెంకటేశ్ ఇమేజ్ కూడా తోడైతే బాగుంటుందని భావించిన ఆయన, ఆ ఇద్దరితో ఒక మల్టీ స్టారర్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడని అంటున్నారు.

 సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైనే ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఇంతవరకూ ఈ బ్యానర్లో వచ్చిన సినిమాలన్నిటికంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారట. ఇప్పటికే స్టోరీ లైన్ ఓకే అయిందని అంటున్నారు గానీ .. డైరెక్టర్ ఎవరనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నారు
 
venkatesh
rana

More Telugu News