సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం

*  ప్రతి రంగంలోనూ ఆటుపోట్లు వుంటాయంటోంది అందాలతార కాజల్ అగర్వాల్. "నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా గందరగోళంగా వుండేది. ఇక్కడ నిలదొక్కుకోగలనా? లేదా? అనిపించేది.. అయితే, ఇలాంటి ఆటుపోట్లు సహజం, ఎక్కడైనా ఉంటాయని సరిపెట్టుకుని పోరాడాను" అని చెప్పింది కాజల్.          
*  ప్రస్తుతం 'విశ్వరూపం 2', 'శెభాష్ నాయుడు' చిత్రాలతో బిజీగా వున్న ప్రముఖ నటుడు కమలహాసన్ మరో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రం తమిళ వెర్షన్ కోసం 'తలైవన్ ఇరుక్కిరన్' అనే టైటిల్ని ఇప్పటికే రిజిస్టర్ చేశారు.
*  పలు చిత్రాలలో హీరోగా నటించి, తన సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ పాత్రలు పోషిస్తున్న అరవింద్ స్వామి దర్శకుడిగా మారుతున్నాడు. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. విశేషం ఏమిటంటే, అరవింద్ ను సినీ రంగానికి పరిచయం చేసిన మణిరత్నం దీనిని నిర్మిస్తాడట.  
*  బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న 'జయ జానకి నాయక' చిత్రం ఆడియో వేడుక ఈ నెల 31న హైదరాబాదులో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు చిత్ర ప్రముఖులు హాజరవుతారు.
Kajal

More Telugu News