ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే పేరే జోరుగా వినిపిస్తోంది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే పేరే జోరుగా వినిపిస్తోంది!

ప్రభాస్ అభిమానుల దృష్టి ఇప్పుడు 'సాహో' పైనే వుంది. సుజీత్ దర్శకత్వంలో .. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాలో కథానాయిక ఎవరనే విషయంలో ఇంతవరకూ క్లారిటీ రాలేదు. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్ ను సంప్రదించారు.

 అయితే వాళ్లు డిమాండ్ చేసిన పారితోషికం చుక్కల్లో ఉండటంతో, అనుష్కనే తీసుకుందామని భావించి, ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఆమె కూడా డేట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పడంతో అయోమయంలో పడ్డారు. 'దువ్వాడ'లో గ్లామర్ పరంగా దుమ్ములేపిన పూజా హెగ్డే ను సంప్రదిస్తున్నారనేది తాజా వార్త. ఆమె తప్పకుండా అంగీకరిస్తుందనే అంతా అనుకుంటున్నారు.
pooja hegde

More Telugu News