అల్లు అర్జున్ ట్రైనింగ్ అమెరికాలో కాదు ఇక్కడే!

'దువ్వాడ జగన్నాథం' సినిమాతో వసూళ్ల పరంగా దుమ్ము దులిపేసిన అల్లు అర్జున్, తన తదుపరి సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఆయన తదుపరి సినిమా వుండనుంది. 'నా పేరు సూర్య .. నా ఇల్లు ఇండియా' అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. దేశభక్తి నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

 అందువలన ఆయన మరింత ఫిట్ నెస్ కోసం అమెరికాలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నాడనీ, త్వరలో అక్కడికి బయల్దేరనున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే ఆయన అమెరికా వెళ్లడం లేదట. అమెరికా నుంచి వచ్చిన ట్రైనర్ ద్వారా శిక్షణ పొందనున్నాడని అంటున్నారు. ఆగస్టు 12వ తేదీ నుంచి అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగులో పాల్గొననున్నాడని చెబుతున్నారు.   
Go Back to Shorts
allu arjun
anu

More Telugu News