Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముమైత్ ఖాన్ తో పాటు సిట్ కార్యాలయానికి 'బిగ్ బాస్' ప్రతినిధులు.. ఫోన్ కూడా ఇవ్వని వైనం!

డ్రగ్స్ కేసులో విచారణకు గాను ఐటెం గర్ల్ ముమైత్ ఖాన్ నేడు సిట్ కార్యాలయానికి హాజరైంది. విచారణ బృందంలోని మహిళా అధికారులు ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు. పూణెలో బిగ్ బాస్ షోలో ఉన్న ఆమె... సిట్ విచారణ కోసం అక్కడ నుంచి వచ్చింది. ఈ సందర్భంగా ఆమెతో పాటు బిగ్ బాస్ షో ప్రతినిధులు కూడా సిట్ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయం సమీపంలో ఉంటూ, అక్కడి కదలికలను వారు గమనిస్తున్నారు. బిగ్ బాస్ అగ్రిమెంట్ లో భాగంగా 70 రోజుల పాటు ముమైత్ బాధ్యత తమదే అని వారు చెబుతున్నారు. షో నుంచి ఆమె బయటకు వెళ్లాడానికి వెసులుబాటు లేకపోవడంతో... నిర్వాహకులు కూడా ఆమెతో పాటే హైదరాబాద్ వచ్చారు. అంతేకాదు, మరెవరితో ముమైత్ మాట్లాడకుండా... ఆమెకు ఫోన్ ఇవ్వకుండా వారు జాగ్రత్త పడుతున్నారు. అగ్రిమెంట్ ప్రకారం బిగ్ బాస్ పార్టిసిపెంట్లు బయట ఎవరితోనూ మాట్లాడటానికి వీల్లేదు. కనీసం వారి కుటుంబసభ్యులతో కూడా మాట్లాడకూడదు. మరోవైపు, విచారణ ముగిసిన వెంటనే వీరు మళ్లీ పూణె బయల్దేరనున్నారు. 

More Telugu News