వైద్య శాస్త్ర అద్భుతం... తండ్రి హత్య చేయబడ్డ రెండున్నరేళ్లకు బిడ్డ జననం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైద్య శాస్త్ర అద్భుతం... తండ్రి హత్య చేయబడ్డ రెండున్నరేళ్లకు బిడ్డ జననం

ప్రపంచ వైద్య శాస్త్రం మరో అద్భుతం చేసింది. 2014లో హత్య చేయబడిన న్యూయార్క్ పోలీస్ డిపార్టుమెంట్ అధికారి భార్య, రెండున్నరేళ్ల తరువాత అతని బిడ్డకు తల్లి అయింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, డిసెంబర్ 2014లో న్యూయార్క్ పోలీసు అధికారి వెంజియాన్ లియూ, అతని సహ అధికారి రఫాలే రామోస్ లతో కలసి పెట్రోలింగ్ కారులో ప్రయాణిస్తున్న వేళ, నిరసనకారులు దాడి చేసి ఇద్దరినీ చంపేశారు. ఆసుపత్రిలో వెంజియాన్ మృతదేహం ఉన్న వేళ, అతని వీర్య కణాలను తీసి భద్రపరచాలని భార్య పియా క్సియా చెన్ వైద్యులను కోరింది. మృతదేహం నుంచి వీర్యాన్ని సేకరించిన డాక్టర్లు దాన్ని భద్రపరిచారు. విధుల్లో ఉండగా మరణించిన తొలి ఆసియన్ అమెరికన్ పోలీస్ అఫీసర్ గా లియో నిలవగా, అతని అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. దాదాపు ఏడాదిన్నర తరువాత, ఆమె అదే వీర్యంతో కృత్రిమ గర్భదారణ పద్ధతులను అనుసరించి గర్భం దాల్చింది. తాజాగా మంగళవారం నాడు అంటే, భర్త చనిపోయిన రెండున్నరేళ్ల తరువాత, న్యూయార్క్ ప్రెస్బిటేరియన్ హాస్పిటల్ లో పండంటి పాపకు జన్మనిచ్చింది.

More Telugu News