Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'విఐపి 2' రిలీజ్ వాయిదా వెనుక ధనుష్ ప్లాన్!

కోలీవుడ్లో వైవిధ్యభరితమైన చిత్రాలను అందించే యువ హీరోల్లో ధనుష్ ఒకరు. గతంలో ఆయన చేసిన 'విఐపి' సినిమా తమిళంలోనే కాకుండా, తెలుగులోను 'రఘువరన్ బీటెక్' పేరుతో విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా ఆయన 'విఐపి 2' సినిమా చేశాడు. ఈ సినిమాకి ఆయనే నిర్మాత కావడంతో, తన పుట్టిన రోజైన ఈ నెల 28వ తేదీన తమిళ .. తెలుగు భాషల్లో విడుదల చేయాలనుకున్నాడు.

అయితే పనులు పూర్తికాకపోవడం వలన వాయిదా వేస్తున్నట్టుగా చెప్పారు. అందులో నిజం లేదనేది తాజా సమాచారం. ఈ సినిమాలో కాజోల్ కీలకమైన పాత్రను పోషించింది. అంతే కాకుండా బాలీవుడ్ జనాలకి హీరోగా ధనుష్ పరిచయమే. అందువలన హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మూడు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఆగారట .. అదీ సంగతి.
dhanush
amalapaul

More Telugu News