Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిర్మాత తనయుడే హీరో .. హీరోయిన్ గా శివాని?

తాజాగా ఫిల్మ్ నగర్లో శివాని సినీరంగ ప్రవేశాన్ని గురించి ఒక వార్త హల్ చల్ చేస్తోంది. జీవితా రాజశేఖర్ల కూతురు శివాని, కథానాయికగా త్వరలో వెండితెరకు పరిచయం కానున్నట్టు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె తొలి సినిమాలో హీరో ఎవరు? అనే ఆసక్తి అందరిలోను నెలకొంది.

ఈ నేపథ్యంలోనే 'పెళ్లి చూపులు' నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు 'శివ' పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ కుర్రాడు విదేశాల్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ ఏడాది చదువు పూర్తి కానుండటంతో, అతణ్ణి హీరోగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో రాజ్ కందుకూరి వున్నాడని అంటున్నారు. తనయుడు హీరోగా ఆయన నిర్మించే సినిమాలో కథానాయికగా శివానిని ఎంపిక చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.   
shivani
shiva

More Telugu News