Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మిడిల్ క్లాస్ అబ్బాయి' టెన్షన్ పడుతున్నాడా?

ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకులను పలకరిస్తూ .. విజయాలను సొంతం చేసుకుంటూ నాని ముందుకెళ్తున్నాడు. అలా ఆయన ప్రస్తుతం 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా చేస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో, సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా, యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నారు.

 ముందు నుంచి కూడా  ఈ సినిమాను డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. అయితే డిసెంబర్ 22న చరణ్ మూవీ .. అఖిల్ మూవీ రానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ పరంగా .. తారాగణం పరంగా ఈ రెండు సినిమాలు పెద్దవే కావడంతో నాని టెన్షన్ పడుతున్నాడట. ఆయన ఈ పోటీని ఎదుర్కొంటాడా? మరో విడుదల తేదీని వెతుక్కుంటాడా? అనేది ఆసక్తికరంగా మారింది.
nani

More Telugu News