: 25 పెళ్లిళ్లు.. 146 మంది సంతానం.. మత పెద్ద నిర్వాకం!


కెనడాలోని బ్రిటీష్‌ కొలంబియా ప్రావిన్సులోని బౌంటిఫుల్‌ అనే ప్రాంతంలో ప్రత్యేక వర్గ ప్రజలు నివసిస్తుంటారు. వారిలో ఒకరైన విన్‌ స్టన్‌ బ్లాక్ మోర్ (61) మతపెద్దగా ఉండేవాడు. భగవంతుడు ఆదేశించాడని మాయమాటలు చెబుతూ 1990 నుంచి ఇప్పటివరకు ఆయన 25 మంది మహిళలను పెళ్లాడాడు. మతపెద్దగా ఉన్న సమయంలోనే ఆయన బహుభార్యత్వంపై ఆరోపణలు రాగా, కెనడా చట్టాల్లోని లొసుగులను ఉపయోగించుకుని విచారణ, శిక్షల నుంచి తప్పించుకుంటూ వచ్చేవాడు.

అయితే 2011లో కెనడా న్యాయస్థానం బహుభార్యత్వాన్ని నిషేధించింది. అయినప్పటికీ విన్ స్టన్ బ్లాక్ మోర్ మాత్రం వాటిని ఏమాత్రం లెక్క చేయలేదు. వివాహాలు చేసుకుంటూనే ఉన్నాడు. ఇలా 25 ఏళ్లలో తన 25 మంది భార్యలతో కాపురం చేసి 146 మంది పిల్లల్ని కన్నాడు. దీనిపై ఆయన మాజీ భార్య న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి విచారించిన బ్రిటీష్‌ కొలంబియా సుప్రీంకోర్టు జస్టిస్‌ షెరీ ఆన్‌ డొనెగాన్‌ అతనికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. 

  • Loading...

More Telugu News