నేడు సిట్ విచారణకు ఛార్మీ.. ప్రశ్నావళితో మహిళా అధికారుల రెడీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేడు సిట్ విచారణకు ఛార్మీ.. ప్రశ్నావళితో మహిళా అధికారుల రెడీ!

హైదరాబాదును పట్టిపీడిస్తున్న డ్రగ్ దందాలో నేడు ఛార్మీని సిట్ విచారించనుంది. సిట్ విచారణలో తనకు న్యాయం జరగదని హైకోర్టును ఛార్మీ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిట్ విచారణ ఎదుర్కొనేందుకు ఛార్మీ పూర్తి స్థాయిలో సన్నద్ధం కాగా, ఆమెను విచారించేందుకు ఎక్సైజ్ మహిళా సూపరింటెండెంట్ తో పాటు ముగ్గురు మహిళా సీఐలను సిట్ ఎంపిక చేసింది. వీరు నలుగురూ ఛార్మీని విచారించనున్నారు. ఈ మేరకు ప్రశ్నావళి కూడా సిద్ధం చేశారు. హైకోర్టు  మార్గదర్శకాల ప్రకారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఛార్మీని విచారించే అవకాశం ఉంది.  

More Telugu News