ఇక డైరెక్షన్ చేసేస్తానంటోన్న అరవింద్ స్వామి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇక డైరెక్షన్ చేసేస్తానంటోన్న అరవింద్ స్వామి!

వెండితెరపై రొమాంటిక్ హీరోగా ఎక్కువ మార్కులు కొట్టేసిన కథానాయకులలో అరవింద్ స్వామి ఒకరు. ఆ తరువాత బిజినెస్ వ్యవహారాలకు ప్రాధాన్యతనిచ్చిన ఆయన, ఈమధ్యనే రీ ఎంట్రీ ఇచ్చారు. తన వయసుకి తగిన పాత్రలను .. కథకి కీలకమనుకున్న పాత్రలను మాత్రమే చేస్తూ ఆయన మరింత క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాంటి అరవింద్ స్వామి త్వరలో మెగాఫోన్ పట్టాలనుకుంటున్నాడనేది కోలీవుడ్ టాక్.

దర్శకుడిగా కూడా మారిపోయి అభిరుచి కలిగిన సినిమాలను తెరకెక్కించాలనే ఆలోచన అరవింద్ స్వామికి ఎప్పటి నుంచో ఉందట. అందుకు ఇప్పుడు సమయం ఆసన్నమైందని ఆయన భావిస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తోన్న నాలుగు తమిళ సినిమాలు పూర్తి కాగానే, మెగా ఫోన్ పట్టేస్తాడట. ఈ ప్రచారంలో వాస్తవమెంతన్నది చూడాలి మరి.       
aravindswami

More Telugu News