ముంబైలో ‘గోల్‌మాల్‌’ సెట్లో బన్నీ సందడి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముంబైలో ‘గోల్‌మాల్‌’ సెట్లో బన్నీ సందడి!

అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా సమయం ఉండటంతో .. ఈ గ్యాప్ లో బన్నీ ఒక యాడ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్ ముంబైలోని ఓ స్టూడియోలో జరుగుతోంది. ఆ పక్కనే గల ఫ్లోర్ లో 'గోల్ మాల్ ఎగైన్' షూటింగ్ జరుగుతోంది.

అజయ్ దేవగణ్ .. టబూ .. పరిణీతి చోప్రా ప్రధానమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాకి, రోహిత్ శెట్టి  దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. పక్కనే గల ఫ్లోర్ లో బన్నీ షూటింగ్ జరుగుతోందని తెలుసుకున్న ఈ సినిమా టీమ్, ఆయనని ఆత్మీయంగా తమ సినిమా సెట్ కి ఆహ్వానించారు. దాంతో బన్నీ అక్కడికి వెళ్లి వాళ్లతో మాటామంతి జరిపాడు. 'గోల్ మాల్ ఎగైన్ ' టీమ్ కి శుభాకాంక్షలు అందజేసిన ఆయన, తిరిగొచ్చి తన షూటింగులో నిమగ్నమై పోయాడు.    
allu arjun

More Telugu News