ఫైనల్‌కు ముందు భారత ప్రజల ఆశీస్సులు కోరిన హర్మన్‌ప్రీత్.. నేడే ఫైనల్స్!

23-07-2017 Sun 08:38 | Sports
మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో చితక్కొట్టిన టీమిండియా బ్యాట్స్ విమెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫైనల్‌కు ముందు భారత ప్రజల ఆశీస్సులు కోరింది. నేడు (ఆదివారం) ఇంగ్లండ్‌తో ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఫైనల్ పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి భారత్‌కు మహిళల ప్రపంచకప్ అందించి మిగిలిపోయిన ఆ ఒక్క ముచ్చటా తీర్చుకోవాలని మిథాలీ సేన భావిస్తోంది. ఈ సందర్భంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్మన్ మాట్లాడుతూ..

ఇంగ్లండ్‌పై గెలిచి ట్రోపీ కొట్టుకురావాలంటే తనకు, జట్టుకు భారతీయుల ఆశీస్సులు కావాలని కోరింది. ఇతర విషయాలు మన చేతుల్లో ఉండవని పేర్కొన్న హర్మన్, ప్రస్తుతం తమకు కావాల్సింది దేశ ప్రజల ఆశీస్సులు మాత్రమేనని పేర్కొంది. ఆసీస్‌తో జరిగిన సెమీస్‌లో కెప్టెన్ మిథాలీ రాజ్ అవుటైన తర్వాత జట్టు భారాన్ని తన భుజస్కంధాలపై వేసుకోవాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది. అనుకున్నట్టే అందులో విజయం సాధించగలిగానని వివరించింది.

ఆ మ్యాచ్‌లో హర్మన్ ఆసీస్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించింది. కేవలం 115 బంతుల్లో 20  ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 171 పరుగులు చేసింది. ఆమె ఆటతీరుతో ఫైనల్‌పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దేశం దృష్టిని మొత్తం నేటి ఫైనల్‌ వైపు తిప్పేసుకుంది. ఇక లార్డ్స్ స్టేడియం అయితే నేడు ప్రేక్షకులతో కిక్కిరిసిపోనుంది. ఇప్పటికే లార్డ్స్‌ మైదానంలో టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. మహిళల జట్లు తలపడుతున్న మ్యాచ్‌కు ఇంతమంది ప్రేక్షకులు హాజరవడం ఇదే తొలిసారి కానుంది.

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more