నాని సరసనే కాదు శర్వానంద్ జోడీగాను సాయిపల్లవి!
శర్వానంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'మహానుభావుడు' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ థ్రిల్లర్ చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం సాయి పల్లవిని తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు 'ఫిదా' సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో, ఆమెనే ఖరారు చేసే ఆలోచనలో ఈ సినిమా టీమ్ ఉందని అంటున్నారు. మొత్తానికి సాయిపల్లవి నానితో పాటు శర్వానంద్ జోడీ కూడా కట్టేస్తుందన్న మాట.