rana: ఇలాంటి సినిమా ఇంతవరకూ చూడలేదన్న రానా!

షార్ట్స్‌లో చూడండి
తేజ దర్శకత్వంలో రూపొందిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా విడుదలకి ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో రానా మాట్లాడుతూ .. ఈ సినిమాలో తాను జోగేంద్ర అనే దుష్ట రాజకీయ నాయకుడి పాత్రను పోషించానని చెప్పాడు. ఇది హీరో చుట్టూ తిరిగే రెగ్యులర్ కథ కాదనీ .. కథలో కొన్ని పాత్రల ప్రయాణంగా అనిపిస్తుందని అన్నాడు.

ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా చూడలేదని చెప్పాడు. ఆడియన్స్ కి కూడా ఇదే అభిప్రాయం కలుగుతుందని అన్నాడు. రెగ్యులర్ హీరోలా తాను తెరపై కనిపించాలనుకోవడం లేదనీ, కొత్త కథలు .. పాత్రలు చేయాలని ఉందని చెప్పాడు. తనలోని నటనా శక్తికి పరీక్ష పెట్టే పాత్రలు చేయడానికి ఇష్టపడతానని అన్నాడు. తనకి ఈ సినిమా సక్సెస్ పై నమ్మకం ఉందనీ .. అది తప్పకుండా నిజమవుతుందని చెప్పుకొచ్చాడు.       
Go Back to Shorts
rana
kajal

More Telugu News