'పారితోషికంగా కోట్లు తీసుకునే పూరీ, వేల కోసం డ్రగ్స్ వ్యాపారమా? నమ్మబోనంటున్న' మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న

20-07-2017 Thu 10:10 | Both States
ఎప్పుడో డ్రగ్స్ వాడుంటే, ఆ కేసును ఇప్పుడు నిరూపించి, శిక్షలు విధించేలా చూడటం అసాధ్యమైన పనేనని మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న అభిప్రాయపడ్డారు. పూరీ జగన్నాథ్ పై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై స్పందించిన ఆయన, ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, ఒక్కో సినిమాకు ఆయన మూడు కోట్ల వరకూ తీసుకుంటున్నారని తెలుస్తోందని, అనధికారికంగా అది ఇంకా ఎక్కువే ఉండవచ్చని అన్నారు. పారితోషికంగా కోట్లు తీసుకునే ఆయన, వేలు, లేదా లక్షల కోసం డ్రగ్స్ వ్యాపారం చేస్తారన్న మాటలను తాను నమ్మబోనని వ్యాఖ్యానించారు. ఆయన డ్రగ్స్ వాడితే వాడి ఉండవచ్చని, వాడకపోయీ ఉండచ్చని, ఆ విషయంలో తనకు సమాచారం లేకున్నా, సాలీనా కోట్లు సంపాదించే వ్యక్తి, డ్రగ్స్ తీసుకుని ఉండవచ్చే తప్ప, వ్యాపారం చేస్తారని అనుకోవడం లేదని అన్నారు.

ఓ కథను అమ్ముకున్నా, ఐడియాను అమ్ముకున్నా ఆయనకు కోట్లలో డబ్బు దక్కే పరిస్థితులున్న నేపథ్యంలో ఈ లక్షకు, రెండు లక్షలకు కక్కుర్తి పడి డ్రగ్స్ దందాను చేశారంటే ఎవరూ నమ్మరని అన్నారు. అయితే, ఆయన డ్రగ్స్ తీసుకుంటూ వేరే వాళ్లకు ఎవరికైనా ఇచ్చుంటే మాత్రం అది నేరమవుతుందని, ఆ విషయం విచారణలో తెలుస్తుందని అన్నారు. ఇక డ్రగ్స్ అమ్మకాలు చెక్కుల ద్వారా జరుగుతాయని కూడా తాను భావించడం లేదని, డ్రగ్స్ కోసం రూ.4,30,021 చెక్కును ఎవరూ ఇవ్వరని, ఏ ఈవెంట్ మేనేజ్ కోసమో పూరీ జగన్నాథ్ దీన్ని కెల్విన్ కు ఇచ్చి వుండవచ్చని అన్నారు. ఇల్లీగల్ దందాలన్నీ నగదు రూపంలోనే సాగుతాయని చెప్పారు. డ్రగ్స్ వాడుతున్నాడని నిర్థారణ అయినా, అతని వద్ద నామమాత్రంగానైనా మత్తుమందులు దొరకకుంటే అతన్ని ఏమీ చేయలేరని రెడ్డన్న వెల్లడించారు.

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more