: నటి సంజన వీడియో లీక్.. సోషల్ మీడియాలో హల్‌చల్!


దండుపాళ్యం2 హీరోయిన్ సంజనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఆమెపై కొన్ని సన్నివేశాలను నగ్నంగా చిత్రీకరించినట్టు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు ఆ సీన్లు కట్ చేసినట్టు సమాచారం. అయితే అందుకు సంబంధించిన కొన్ని దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాకెక్కడం సెగలు పుట్టిస్తోంది. సంజన తెలుగులో 'బుజ్జిగాడు' సినిమాలో హీరోయిన్ సోదరిగా నటించింది. టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయినప్పటికీ పెద్దగా పేరు రాలేదు.

 దీంతో తన మాతృభాష కన్నడ రంగంపైనే దృష్టి పెట్టి అక్కడ పలు సినిమాలు చేసి, పాప్యులరైంది. కాగా, గతంలో విడుదలైన దండుపాళ్యం ఘన విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా దండుపాళ్యం2ను తెరకెక్కించారు. శాండల్‌వుడ్‌లో ఇప్పుడీ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. శుక్రవారం(21న) తెలుగులో విడుదల కాబోతోంది. సంజన వీడియో లీక్‌పై వస్తున్న వార్తపై ఆ చిత్ర దర్శకుడు శ్రీనివాస్ రాజు స్పందించారు. ఆ వీడియో రియల్ కాదని పేర్కొన్నారు. ఆ వీడియోలో ఉన్నది సంజన కాదని స్పష్టం చేశారు. అయితే సంజన మాత్రం ఈ వీడియోపై ఇప్పటి వరకు స్పందించలేదు.

  • Loading...

More Telugu News